అజ్ఞాతంలో యాంకర్ ప్రదీప్‌‌.. తెర వెనక ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?

2018-01-05 631

Source said that, Political bigshot trying to save anchor Pradeep. Pradeep was caught drunk and driving, the media has made much hue and cry by continuously airing the incident of Pradeep on their television channels.

యాంకర్ ప్రదీప్ ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు అతడి బిఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. పోలీసులు అతడిని కౌన్సిలింగుకు హాజరు కావాలని ఆదేశించినా ఇప్పటి వరకు అతడు రాలేదు. అతడి కోసం కొందరు పోలీసులు ఇంటికి వెళ్లినా అతడి జాడ దొరకలేదు. దీంతో ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
కేసు నుండి తప్పించుకునేందుకు ప్రదీప్ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసు కౌన్సిలింగుకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్నాడనవి వార్తలు వినిపిస్తున్నాయి.
కేసు నుండి తప్పిస్తానని ప్రదీప్ కు ఓ ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నువ్వు కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఉండు, రెండ్రోజులైతే మీడియా ఈ విషయాన్ని మరిచిపోతుంది. తర్వాత అంతా నేను సెట్ చేస్తాను అని సదరు వ్యక్తి ప్రదీప్ కు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రదీప్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండానే సీజ్ చేసిన కారును విడిపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. మరి ప్రదీప్ వెనక ఉన్న ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది