Stylish Star Allu Arjun's Naa Peru Surya Teaser took YouTube by storm. The teaser crossed 10 million digital views within 29 hours after release which is highest for any Telugu film.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. న్యూఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం అయింది. విడుదలైన 29 గంటల్లోనే 10 మిలియన్(కోటి) డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుని ఫాస్టెస్ట్ 10 మిలియన్ మార్కు అందుకున్న టీజర్‌గా టాలీవుడ్లోని రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది.
తెలుగు సినిమా చరిత్రలో ఏ సినిమా టీజర్‌గానీ, ట్రైలర్ గానీ ఇంత తక్కువ సమయంలో 10 మిలియన్ మార్కు అందుకోలేదు. ఈ విషయంలో ‘నా పేరు సూర్య' అన్ని సినిమాలను వెనక్కి నెట్టేసి నెం.1 స్థానంలో నిలిచింది.
‘నా పేరు సూర్య' సినిమా కోసం బన్నీ ఎంత హార్డ్ వర్క్ చేశాడో టీజర్లో కనిపిస్తోందని,...... తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కూడా ఇంత ఇంపాక్ట్ చూపించలేదని అభిమానులు అంటున్నారు.
టీజర్ విడుదల ముందు వరకు ‘నా పేరు సూర్య' చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు. వక్కతం వంశీకి దర్శకత్వం కొత్తకావడమే అందుకు కారణం. అయితే టీజర్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలాగా అతడు సినిమాను తెరకెక్కించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది.