Srimukhi Reacted On Anchor Pradeep Drunk And Drive Case Controversy.
తెలుగు యాంకర్, టీవీ హోస్ట్ ప్రదీప్ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అతిగా మధ్యం సేవించి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు కారు సీజ్ చేశారు. కౌన్సిలింగుకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే కౌన్సిలింగుకు ప్రదీప్ హాజరు కాలేదు.
మంగళవారమే ప్రదీప్ కౌన్సిలింగుకు హాజరు కావాల్సి ఉండగా.... బుధవారం ఉదయం 11 గంటల వరకూ హాజరు కాలేదని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ తెలిపారు. బుధవారం ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే, ఈ విషయాన్ని కూడా చార్జ్ షీట్ రిపోర్టులో చేరుస్తామని పోలీసులు తెలిపారు.
డిసెంబర్ 31వ తేదీ రాత్రి బ్రీత్ ఎనలైజర్‌తో పోలీసులు ప్రదీప్‌ను పరీక్షించగా.... 178 పాయింట్లు చూపించింది. దీన్ని బట్టి సాధారణ స్థాయి కంటే ప్రదీప్ నాలుగైదు రెట్లు ఎక్కువ మధ్యం సేవించాడని తేలిపోయింది. దీనికి గాను ఆయనకు దాదాపు వారం రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.
డిసెంబర్ 31 రాత్రి ప్రదీప్ పోలీసులకు దొరికిపోయిన సమయంలో ఆయన కారులో ఓ అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె ఎవరు? అనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. కార్లో ఉన్నది శ్రీముఖి అంటూ ఓ రూమర్ రావడంతో ఆమె స్పందించారు.