ఆ ఫోటోలో ఉన్నది నా కొడుకు కాదు.. మంచు విష్ణు రిక్వెస్ట్ !

2018-01-03 486

Vishnu Manchu and his wifey dearest Viranica had a new addition in their family, as Viranica delivered a baby boy in Hyderabad. Soon after, fake pictures of Vishnu Manchu’s newborn started doing the rounds on the internet.


తెలుగు సినీ నటుడు మంచు విష్ణు, వెరోనికా దంపతులు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మంచు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగితేలుతున్న వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలు వారిని అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఎవరో అబ్బాయి ఫోటోను తన కొడుకుగా ప్రచారం జరుగుతోందని, దీన్ని నమ్మవద్దని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు.
తన కొడుకుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలను షేర్ చేయడం ఆపాలని, ఆ ఫోటోలో ఉన్న బాబు తన బాబు కాదని మంచు విష్ణు తెలిపారు.
త్వరలోనే తన కుమారుడి రియల్ ఫోటో అభిమానులతో పంచుకుంటానని, అప్పటి వరకు అభిమానులు, వెల్ విషర్స్ ఓపిక పట్టాలని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశారు.
మంచు విష్ణు దంపతులకు ఇప్పటికే అరియానా, వివియానా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. తమ కుటుంబంలో ఇపుడు కొత్తగా మరో అబ్బాయి యాడ్ కావడంతో మంచు ఫ్యామిలీ సెలబ్రేషన్ మూడ్లో ఉంది.

Videos similaires