వైఎస్ బయోపిక్‌ లో YSR పాత్రలో మలయాళ నటుడా ?

2018-01-02 1,679

YSR Congress Party president YS Jagan has accepted produce YS Rajasekhar Reddy's biopic. Mammootty may play YSR role.
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ హీరోగా సినిమాను రూపొందిస్తున్న క్రమంలో దానికి పోటీ అన్నట్లుగా వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవునన్నా కాదన్నా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను వచ్చే ఎన్నికల్లో వాడుకుంటారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ నిర్మాణానికి అంగీకించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ వారసత్వాన్ని చంద్రబాబు నాయుడు వాడుకుంటూ వస్తున్నారు. అదే రీతిలో వైయస్ రాజశేఖర రెడ్డిని వైయస్ జగన్ వాడుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారిద్దరికీ చాలా కాలంగా పోటీ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి నేతల బయోపిక్‌లను చూడాల్సి ఉంటుంది.

వైఎస్ బయోపిక్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. హీరో రాజశేఖర్‌తో గతంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ వైఎస్సార్ బయోపిక్ తీయాలని తలపెట్టారు. అయితే అది కార్యరూపం ధరించలేదు.

ఆనందో బ్రహ్మ' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్‌ వైఎస్సార్‌ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తారని సమాచారం. దానికి వైఎస్సార్‌ కుమారుడు, వైసిపి అధినేత జగన్‌ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. త్వరలో బయోపిక్‌కు సంబంధించిన వివరాలను రాఘవ్‌ ప్రకటిస్తారని అంటున్నారు.

Videos similaires