రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, వీడియో !

2018-01-02 144

On the occasion of New Year, Telanagana Chief Minister K Chandrashekar Rao held a meeting with Telangana State Power Generation Corporation Limited CMD D. Prabhakar Rao and other Power Department officials in Hyderabad.

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పలు ప్రజాకర్షక పథకాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంబించారు.

రైతులకు సోమవారం నుంచే 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది గంటలు ఇస్తున్నారు. రాష్ట్రంలోని 3 లక్షల పంపు సెట్లకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా ఉంటుంది. దీనికి ఏడాదికి 5,500 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

కాగా నూతనసంవత్సర వేళ ప్రారంభమైన 24 గంటల వ్యవసాయ కరెంటు రాష్ట్రమంతటా విజయవంతంగా అమలవుతోంది. 23 లక్షల వ్యవసాయ కనెక్షలకు విద్యుత్‌ సంస్థలు నిరంతరంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంటలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ పంపిణీని ప్రారంభించారు.

అలాగే ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం డిపాజిట్ చేయనుంది. ఇది రెండు విడతల్లో జరుగుతుంది. మొదటి విడత 4 వేల రూపాయల చొప్పున ఖరీఫ్ కోసం మేలో డిపాజిట్ చేస్తారు. రెండో విడత రబీ కోసం నవంబరులో డిపాజిట్ చేస్తారు. దీనివల్ల 60 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.