న్యూ ఇయర్ వెకేషన్ లో మహేష్.. వైరల్ అవుతున్న ఫోటో !

2017-12-31 2,157

Actor Mahesh Babu, who was MIA from his wife Namrata Shirodkar's vacation album, has finally made an appearance. The family of four - Mahesh Babu, Namrata Shirodkar and their children Gautham and Sitara - are vacationing in Oman with their friends.


సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ ప్రతి ఏడాది న్యూ ఇయర్ విదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈ సారి కూడా మహేష్ బాబు తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. ఈ సారి తమ వెకేషన్‌కు గల్ఫ్ కంట్రీలను ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ... వారి స్నేహితులతో కలిసి ఒమన్ దేశంలో గడుపుతున్నారు. సాధారణంగా వెకేషన్ ఫోట్లో కనిపించడానికి మహేష్ బాబు ఇష్టపడరు. అయితే ఓ సెల్ఫీ పిక్‌లో ఆయన తన ఫ్రెడ్స్‌తో కలిపి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అను నేను షూటింగుతో పాటు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తోరకెక్కుతున్న చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే క్రిస్మస్, న్యూఇయర్ కోసం షూటింగుకు బ్రేక్ ఇచ్చినట్లు తెలెస్తోంది.
మహేష్ బాబుకు పూర్తిగా ఫ్యామిలీ మెన్ అనే టాక్ వుంది. ఎప్పుడూ షూటింగుల్లో బిజీగా ఉండే ఆయన మిగతా సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయిస్తారు.
మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ సాధారణ జనం మధ్యకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి విదేశీ ట్రిప్పులకే ప్రాధాన్యం ఇస్తారు మహేష్ బాబు.