Behind those shaped Bollywood bodies are celebrity’s fitness trainers who are making sure the stars sweat out in the gym.
గ్లామర్ వరల్డ్‌లో ఫిట్‌నెస్‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బాడీ షేప్‌లో ఏమాత్రం తేడా కొట్టినా.. అవకాశాలు బోల్తా కొడుతాయి. కాబట్టి స్టార్ హీరోలు, హీరోయిన్లు, మోడల్స్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతారు. సరైన డైట్, సరైన ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్స్ ను నియమించుకుంటారు. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్ హీరో, హీరోయిన్లకు ఫిట్‌నెస్‌పై శ్రద్ద ఎక్కువనే చెప్పాలి. అందుకే.. జిమ్ ట్రైనర్ల కోసం వారు భారీగానే ఖర్చు చేస్తున్నారు.
హీరోయిన్ కరీనా కపూర్ తన జిమ్ ట్రైనర్ నమ్రతా పురోహిత్‌కు నెలకు రూ.65 వేలు జీతం ఇస్తున్నారట. కంగనా రనౌత్ కూడా కరీనా ట్రైనర్ నమ్రతా పురోహిత్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకు గాను ఆమె కూడా నెలకు రూ.65వేలు చెల్లిస్తున్నారు.
సోనమ్ కపూర్ తన జిమ్ ట్రైనర్ రాధికా కర్లేకు నెలకు రూ.55 వేలు ఇస్తున్నారట.
దీపికా పదుకొనే, అలియా భట్, బిపాసా బసు.. ఈ ముగ్గురూ ఒకే ట్రైనర్ వద్ద ట్రెయిన్ అవుతున్నారు. యాస్మిన్ కరాచివాలా అనే ట్రైనర్ వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ముగ్గురూ నెలకు రూ.45వేలు జీతంగా ఇస్తున్నారట.