మహేష్ కత్తిపై హైపర్ ఆది 'జబర్దస్త్' పంచ్ !

2017-12-30 4

Jabardhasth comedian Hyper Adi jabardasth punch on Mahesh Kathi?

మహేష్ కత్తి పైన జబర్దస్త్ ఆది మరో పంచ్ వేశారా? జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన వేసే పంచ్‌లు అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. నెట్లోను ఆయన జబర్దస్త్ వీడియోలకు బాగా వ్యూస్ వస్తాయి.హైపర్ ఆది స్పాంటేనియస్‌గా కూడా పంచ్‌లు వేయగల సమర్థుడు అని అంటుంటారు. స్కిట్‌లోను అప్పటికి అప్పుడు అవసరమైతే పంచ్‌లు వేస్తుంటామని ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. జబర్దస్త్‌లో తనదైన పంచ్‌లతో అందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్న ఆది ఇటీవల మరో రకంగాను వార్తల్లో నిలిచారు.

తనను తాను ప్రమోషన్ చేసుకునేందుకు, నిత్యం మీడియాలో నానేందుకు కత్తి మహేష్ పదేపదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల తన స్కిట్‌లో హైపర్ ఆది తనపై సెటైర్ వేశారని మహేష్ కత్తి ఆరోపించారు. ఆది మాత్రం నీపైన నేను ఎందుకు వేస్తానని సూటిగా సమాధానం చెప్పారు.