ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రేణు... ఎక్కడుందో తెలుసా?

2017-12-29 1,824

If, Kashmir is heaven, then Kahwa is nectar. Kahwa is an exotic mix of Kashmiri green tea leaves, whole spices, nuts and saffron, which was traditionally prepared in a brass kettle known as samovar. The samovar has a central cavity where hot coal is placed while the surrounding space is reserved for boiling the water and other ingredients for the tea." Renu Desai said

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆయన గురించి ప్రస్తావనతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ ప్రస్తావన తేవడం పూర్తి గా మానేశారు. తాను ఏదైనా కామెంట్ చేస్తే..... ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే అవకాశం ఉండటంతో ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఓ టీవీ ఛానల్లో డాన్స్ రియాల్టీ‌షోకు జడ్డిగా వ్యవహరించిన ఆమె ఇపుడు కాస్త సమయం దొరకడంతో కిస్మస్, న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు.
ఇండియాలో స్వర్గం లాంటి ప్రదేశం అంటే కాశ్మీర్ లోయ. ప్రస్తుతం రేణు దేశాయ్ ఈ స్వర్గంలోనే గడుపుతున్నారు. అంతే కాదు అక్కడ అమృతం లాంటి ఓ పానీయం సేవిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కాశ్మీర్ స్వర్గం అయితే.... ఇక్కడ దొరికే కహ్వా అనే పానీయం అమృతం లాంటిది. కాశ్మీర్ గ్రీన్ టీ ఆకులు, సుగంధ ద్రవ్యాలు, నట్స్, కుంకుమ పువ్వు లాంటివి కలిపి 'సమోవర్' అనే సంప్రదాయ ఫిల్టర్‌లో ఈ పానీయాన్ని తయారు చేస్తారని రేణు దేశాయ్ తెలిపారు. కహ్వా గురించి రేణు దేశాయ్ వర్ణించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.