Mumbai Kamala Mills Fire : ముంబై అగ్ని ప్రమాదం: కుష్బూ మృతి

2017-12-29 294

Mumbai Kamala Mills Fire : A massive fire broke out at a building in Kamala Mills Compound in the Lower Parel area of Mumbai

ముంబైలో అర్ధరాత్రి చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదంలో పుట్టిన రోజు జరుపుకొన్న కుష్బూ అనే మహిళ కూడ ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. ఇందులో 11 మంది మహిళలు కూడ ఉన్నారు.పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ముంబైలో గురువారం నాడు చోటు చేసుకొన్న అగ్ని ప్రమాదం పలు కుటుంబాల్లో విషాన్ని నింపింది. కమల మిల్స్ కాంపౌండ్‌లోని లండన్ టాక్సీగాస్ట్రోబార్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. పుట్టిన రోజు వేడుకలకు హజరైన మహిళలు ఎక్కువగా ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకొంటామని బిఎంసీ చైర్మెన్ విశ్వనాథ్ మహదేశ్వర్ ప్రకటించారు. ఈ భవనంపై గతంలో పలు దఫాలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త మంగేష్ కాలాస్కర్ చెప్పారు.