Film Critic Kathi Mahesh Shocking Comments On Jr NTR and Nani in his recent interview.
పవన్ కళ్యాణ్ ఇష్యూలో మహేష్ కత్తి ఈ మధ్య హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాలతో మొదలై అతడి రాజకీయ పరమైన మూమెంట్స్ పైన కత్తి మహేష్ తరచూ విమర్శనాత్మకంగా తన అభిప్రాయాలు చెబుతూ పవర్ స్టార్ అభిమానుల దృష్టిలో విలన్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేష్ జూ ఎన్టీఆర్, నాని మీద ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలుగులో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? అనే ప్రశ్నకు కత్తి మహేష్ స్పందిస్తూ..... తెలుగులో ఉన్న వారిలో నాని గుడ్ యాక్టర్, తారక్ గుడ్ యాక్టర్, వీరిద్దరూ నాకు బెటర్ అనిపిస్తారు.
నేను తారక్(జూ ఎన్టీఆర్)ను అభిమానిస్తున్నానని చెప్పడం లేదు, అలాంటపుడు ఇతర హీరోల అభిమానులు ఆయన్ను ఏమన్నా అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది... అని కత్తి మహేష్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
తారక్ సినిమాలు బాగోలేకుంటే ఎందుకు అతడు పిచ్చి సినిమాల్లో నటిస్తున్నాడని ఇప్పటికీ అంటాను. అతడు బెటర్ యాక్టరే... అతడు ఎంచుకునే పాత్రలు బావుంటే బావుందని చెబుతాను, బాగోలేకుంటే బాగోలేదని చెబుతాను కత్తి మహేష్ తెలిపారు.