Telangana Minister KT Rama Rao on Thursday night answered in twitter to netigens.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం రాత్రి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చారు. పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. వివిధ అంశాలపై స్పందించారు.
నటులు అల్లు అర్జున్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, నటీమణి సమంత తదితరుల గురించి మాట్లాడారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటు వేసేందుకు తనకు ఓటు హక్కు లేదని చెప్పారు.
అల్లు అర్జున్ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఎనర్జీ, స్టైల్ అని కేటీఆర్ ప్రశంసించారు. మరొకరు మహేష్ బాబు గురించి అడగగా.. స్క్రీన్ ప్రెసెన్స్ అన్నారు. ఇష్టమైన డైరెక్టర్ ఎవరని అడగగా.. ఆయా అంశాలను బట్టి చాలామంది ఉన్నారని చెప్పారు. ఇంకొకరు సినిమా గురించి అడగగా.. తనకు చాలా సినిమాలు ఇష్టమని చెప్పారు. ప్రభాస్ గురించి ఒక్క మాట చెప్పమని అడగగా.. బాహుబలి అన్నారు. తనకు ఇష్టమైన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అని తెలిపారు. జూ.ఎన్టీఆర్ గురించి చెప్పమని అడగగా. పర్ఫార్మర్ అన్నారు
పవన్ కళ్యాణ్ గురించి అడగగా ఎనిగ్మా అని కేటీఆర్ అన్నారు. ఎనిగ్మా అంటే ఎవరికీ అర్థం కాని వ్యక్తి అని అర్థం. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏమిటని ఓ నెటిజన్ అడగగా.. డిసైడ్ చేసేందుకు నేను ఎవరిని అని ప్రజలు డిసైడ్ చేస్తారని చెప్పారు.