While the 300-run mark by a batsman in One-Day International is yet to be breached, former India skipper Kapil Dev believes the day is not far when a batsman will score 400 in the 50-over format.
భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ప్రస్తుత క్రికెటర్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్ముందు వన్డే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లు 400 కూడా బాదేస్తారన్నారు. అటువంటి రోజులు ఎంతో దూరంలో లేదని అన్నారు.
ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన వండర్ సిమెంట్ 7 క్రికెట్ మహోత్సవం సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 'ప్రస్తుతం క్రికెటర్ల మైండ్‌సెట్‌లో చాలా మార్పులు వచ్చాయి. 35 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసేస్తున్నారు. మా రోజుల్లో ఇది సాధ్యం కాలేదు. భారత క్రికెట్‌లోని నాణ్యత ఏమిటో ఫలితాల బట్టే తెలుస్తోంది'అని కొనియాడాడు.
కోహ్లీ-సచిన్ మధ్య పోలిక గురించి మాట్లాడుతూ..'ఈ ఇద్దరి ఆటగాళ్లను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు. ఎవరికి వారే గొప్ప. ఎప్పుడైనా ఎవరైనా బాగా ఆడితేనే జట్టు విజయాలు సాధ్యపడతాయి. అప్పుడే క్రీడలోనూ అభివృద్ధి జరుగుతుంది' అని కపిల్‌దేవ్ పేర్కొన్నాడు.