Kulbhushan Jadhav row : కంటతడి పెట్టిన సుష్మా స్వరాజ్, వీడియో !

2017-12-28 129

Commenting upon the row surrounding Pakistan's allegations of Kulbhushan Jadhav's family carrying a 'camera' on their Islamabad visit, Union External Affairs Minister Sushma Swaraj on Thursday branded the former's allegations totally WRONG.

గూఢచర్యం కేసులో మరణశిక్ష పడి, ప్రస్తుతం పాకిస్తాన్‌లోని జైలులో మగ్గిపోతున్న కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉద్ఘాటించారు. కుల్‌భూషణ్ వ్యవహారంపై బుధవారం పార్లమెంట్ ఉభయసభలు అట్టుడికిన సంగతి తెలిసిందే. దీనిపై సుష్మా స్వరాజ్ గురువారం పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేశారు. జాదవ్ తల్లి, భార్య పట్ల ఆ దేశాధికారులు అనుచితంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు.

ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తించి కుల్‌భూషణ్ జాదవ్‌ను, అతడి కుటుంబ సభ్యులను పాకిస్తాన్ అవమానపరిచిందని, జాదవ్‌ను చూడడానికి వెళ్లిన అతడి తల్లి, భార్యల మెడలోంచి తాళి, చేతికున్న గాజులు, చివరికి నుదిట ఉన్న బొట్టు కూడా తీయించి.. వారిని విధవలుగా మార్చి జాదవ్‌కు చూపించారంటూ రాజ్యసభలో సుష్మా స్వరాజ్ కంటతడి పెట్టారు.కుల్‌భూషణ్ తల్లి అవంతి తమ మాతృభాష అయిన మరాఠీలో మాట్లాడబోగా పాక్ అధికారులు అనుమతించలేదని, సమావేశంలో ఉన్న ఇద్దరు అధికారులు పదే పదే అడ్డుతగిలారని సుష్మా తెలిపారు