నాకు పవర్ లేకుండా చేశారు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య

2017-12-28 5

Referring the poer reforms, Andhra Pradesh CM Nara Chandrababu Naidu said that people made him powerless.


పవర్ సెక్టార్‌లో తాను పలు సంస్కరణలు తెచ్చానని, అయితే 2004లో మీరు తనకు పవర్ లేకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి అన్నారు. అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి గురువారం శంకుస్థాపన చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఏ విధమైన నేరాలు జరగడానికి అవకాశం లేదని, గట్టిగా శిక్ష వేస్తేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు అన్నారు. కోర్టులో ఏదో ఒకచోట తప్పించుకుంటామనే భావనతోనే నేరాలకు పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు.
ఆరునెలల్లో అమరావతికి ఒక రూపం వస్తుందని, పీపీపీ విధానంలో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు అన్నారు. పోలీసు అధికారులందరికి స్కిల్ ట్రైనింగ్ తప్పనిసరి అని అన్నారు. ఎన్ని కేసులు బుక్ చేశామనేది కాదు, ఎన్ని ఛేదించామనేదే ముఖ్యమని అన్నారు.
కేసుల పరిష్కారంలో కాస్త వెనుకబడి ఉన్నామని, టెక్నాలజీ వాడకంలో పోలీసులు కూడా వెనుకబడి ఉన్నారని చంద్రబాబు అన్నారు టెక్నాలజీ ద్వారా తప్పు చేసేవాడిని ముందుగానే గుర్తించవచ్చునని చెప్పారు. నేరాలు రుజువయ్యే రేటు పెరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు నియంత్రించాలని అన్నారు.

Videos similaires