The sources say that Anil Ravipudi got the green signal of both Venkatesh and Fidaa actor Varun Tej for his next upcoming multistarrer movie titled F2(Fun & Frustration).
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ ట్రెండ్ సెట్ చేశారు నిర్మాత దిల్ రాజు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పుడు మరోసారి మల్టీస్టారర్ రిపీట్ చేయబోతున్నారాయన. కథ రీత్యా.. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారట. తాజాగా ఈ ఇద్దరు హీరోలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే కథ డిమాండ్ మేరకు.. ఇందులో మరో ప్రధాన పాత్ర కోసం ఓ యంగ్ హీరోను ఎంచుకోవాలనుకున్నారు. అలా దర్శకుడు అనిల్ రావిపూడి.. రానా దగ్గుబాటి లేదా సాయిధరమ్ తేజ్ లను నటింపజేయాలని భావించాడు.
రానా, సాయి ధరమ్ తేజ్ లను అనుకున్నప్పటికీ.. చివరిగా వరుణ్ తేజ్ ను కలిసి కథ వినిపించారట అనిల్ రావిపూడి. వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో.. వెంకీ కూడా ఓకె అనేశారట. మధ్యలో నాని పేరు కూడా వినిపించినప్పటికీ చివరిగా వరుణ్ తోనే ఫిక్స్ అయిపోయారట.