సాయి పల్లవి నెక్స్ట్ మూవీ ఎవరితోనో తెలుసా ?

2017-12-28 1

Successful hero Sharwanand who is riding high with consecutive hits of Shatamanam Bhavati and Mahanubhavudu this year will next team up with talented director Hanu Raghavapudi. Prasad Chukkapalli and Sudhakar Cherukuri will produce the film Sri Lakshmi Venkateswara Cinemas Banner. Sensational beauty Sai Pallavi is confirmed to play Sharwanand’s love interest in the film.


2017 సంవత్సరంలో శతమానం భవతి, మహానుభావుడు సినిమాలతో వరుస విజయాలు అందుకున్న శర్వానంద్... 'ఫిదా', 'ఎంసీఏ' సినిమాలతో తెలుగులో సూపర్ హిట్ జర్నీ ప్రారంభించిన సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా ఖరారైంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బేనర్లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మేరకు గురువారం ఈ సంస్థ నుండి అఫీషియల్ ప్రకటన విడుదలైంది.
శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్క నున్న ఈ చిత్రానికి ‘అందాల రాక్షసి', ‘కృష్ణగాడి వీరప్రేమగాథ',‘లై' చిత్రాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నారు.
దర్శకుడు హను రాఘవపూడి రొమాంటిక్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో ఎక్స్‌పర్ట్. శర్వానంద్-సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కించే చిత్రాన్ని వినోదాత్మక ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్రం షూటింగ్ జనవరి 3వ వారంలో ప్లాన్ చేస్తున్నారు. ముందుకు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేసి వచ్చే వర్షాకాలం నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Videos similaires