పవన్ కు అలీ దూరం.. కారణం అదేనట..

2017-12-27 2,978

Pawan Kalyan and Comedian Ali are closest friends in Tollywood. They acted together in many films. Reports suggest that Ali is not in the Pawan Kalyan's latest Agnyathavaasi movie. because Ali went to Macca to visit his favorite piligrim place.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ కమ్ హీరో అలీ మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పదన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిప్రేమ చిత్రంతో వారిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. ఖుషీలో వీరి జోడికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి పవన్, అలీ మధ్య ఎవరూ విడదీయలేనంత మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల పవన్, అలీ మధ్య విభేదాలు ఏవో వచ్చాయనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. అందుకు దారి తీసిన పరిస్థితులు ఇవే..
పవన్ కల్యాణ్ ఏ సినిమా అయినా అలీ ఉండి తీరాల్సిందే. పాత్ర లేకపోయినా కొత్తగా సృష్టించైనా ఆయన పాత్రను కథలో చేర్చాలిందే.
అలాంటిది ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్రంలో అలీకి పాత్రలేదనే వార్తతో ఈ రూమర్లకు బలం చేకూరింది. విభేదాల కారణంగానే పవన్ సినిమాకు అలీ దూరం అయ్యాడు అనే న్యూస్ పలువెబ్‌సైట్లో హల్‌చల్ చేశాయి.
పవన్ కల్యాణ్ చిత్రంలో అలీ లేకపోవడానికి ప్రధాన కారణాన్ని ఆయన సన్నిహితులు వెల్లడించారు. దాంతో అలీ ఎందుకు నటించలేదనే వార్తపై క్లారిటీ వచ్చింది. ఇంతకీ పవన్ సినిమాకు దూరంగా ఉండటానికి అసలు కారణం తెలిసిన సినీ వర్గాలు ఆశ్చర్యపోయారు.