The higher officials of the hyderabad police department were serious on the behaviour of the Jawahar Nagar Police Station CI Uma Maheshwar Rao. A photo of this CI's bad behaviour went viral on Social Media. While conducting an enquiry in a murder case, CI Uma Maheshwar Rao personally went to the Victim's House and while writing a complaint this incident was happened.
పోలీసు శాఖలో ఉన్నతాధికారులంతా 'ఫ్రెండ్లీ పోలీసింగ్' పేరు జపిస్తుంటారు. అర్ధరాత్రి నిద్రలోంచి లేపి అడిగినా వారిది అదే మాట. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. కింది స్థాయిలో జరిగేదంతా 'డిఫరెంట్లీ పోలీసింగ్'.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువ కావాలని ఉన్నతాధికారులు ఎన్నిమార్లు చెప్పినా... కొందరు కింది స్థాయి పోలీస్ అధికారుల బుద్దిమాత్రం మారడం లేదు. దీనికి తాజా ఉదాహరణ.. ఓ సీఐ అధికారి ప్రవర్తన.
ఓ మహిళ ఫిర్యాదు రాస్తున్న సమయంలో ఎదురుగా సీఐ కూర్చున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నగరంలోని జవహర్ నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వరరావుపై ఉన్నతాధిరులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది