Watch Nivedita Shankar speech about kcr in World Telugu Conference Programme.
''ప్రపంచ తెలుగు మహా సభలు 2017 తెలంగాణ వంటలు...!''
హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలు మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ రాష్టాల నుంచి, జిల్లాల నుంచి హాజరైన భాషాభిమానులను పలకరించినప్పుడు వారి స్పందన...నిర్మల్ నుండి వచ్చిన అడ్వకేట్ నివేదితశంకర్ మాట్లాడుతూ ఈ ఇదు రోజుల్లో ప్రతి సభను నేను ఆస్వాదించాను . శ్రీకృష్ణ దేవరాయలు కేవలం ఎనమిది మంది కవులనే పోషించారు కాని కేసిఆర్ ఎన్నో వేల మంది కవులను పోషిస్తున్నారు, ఈ ఇదు రోజులు కూడా పెట్టిన తెలంగాణా వంటలు, ఇచ్చిన ఆతిధ్యం మరచిపోలేనిది, ఈ వేడుకలు చరిత్రలో మిగిలిపోతాయి ఇలాంటి వేడుకలు ఇప్పటి వరకు జరగలేదు అని అభిప్రాయ పడ్డారు.