హైదరాబాద్ అంటే బిర్యానీ, బాహుబలి

2017-12-20 140

Hyderabad is the city of biryani, badminton and Baahubali, President Ramnath Kovind said at the LB Stadium for the closing of World Telugu Conference.

ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. మంగళవారం సాయంత్రం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ముగింపు సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం స్థానిక పరిమళాలను వెదజల్లింది.తెలుగు సాహిత్యంలోని వైతాళికులను గుర్తు చేస్తూ, తెలుగు సాహిత్య మహత్వాన్ని చాటుతూ ఆయన ప్రసంగం సాగింది. తన ప్రసంగాన్ని ఆయన రాయప్రోలు సుబ్బారావు రాసిన దేశభక్తి గీతంతో ముగించారు.
హైదరాబాద్ నగరం అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి అని రామ్‌నాథ్ కోవింద్ అనారు. హైదరాబాద్ రుచికరమైన ఆహారాన్ని, బ్యాడ్మింటన్ చాంపియన్లను, ఇండియన్ సాఫ్ట్ పవర్‌ను వ్యక్తీకరించే సినిమాలను అందించిందని ఆయన అన్నారు. తెలుగు వంటకాలకు ముఖ్యంగా పచ్చళ్లకు ఢిల్లీలో ఎంతో ఆదరణ ఉందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ నగరం మాదిరిగానే తెలుగు భాషష దేశంలోని పలు సంస్కృతులకు, ప్రాంతాలకు వారథిలా పనిచేస్తోందని కోవింద్ అన్నారు. గ్లోబల్ మెట్రోపోలిస్ మదిరిగా హైదరాబద్ పాన్ - ఇండియన్ సిటీ అని ఆయన అన్నారు. హైదరాబాదులోని టెక్నాలజీ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు దేశానికి ఎంతో అందిస్తున్నాయని చెప్పారు .హెల్త్ సెంటర్లు, సినిమా .. స్పెషల్ ఎఫెక్ట్ ప్రొడక్షన్ సెంటర్లు, క్రీడా సౌకర్యాలకు హైదరాబాద్ పేరు గాంచిందని చెప్పారు. అది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు.