BJP MLC Somu Veerraju has lashed out at the TDP on the Gujarat election results with TD MLC Rajendra Prasad and elsewhere on Tuesday.
ఏపీలో మిత్రపక్షాలు తెలుగుదేశం, బీజేపీల మధ్య మరోసారి మాటల యుద్ధం ప్రారంభమైంది. గతంలో ప్రత్యేక హోదా, ఇటీవల పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలతో పాటు వివిధ సందర్భాల్లో గత మూడేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్య వాగ్యుద్ధం కనిపించింది.
స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం సహకారం అవసరమని చెబుతూ ఆయన చల్లబడుతున్నారు. పార్టీ నేతలు బీజేపీపై విమర్శలు గుప్పించినప్పుడు క్లాస్ పీకుతున్నారు.
బీజేపీ నేతలు సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివ రావు వంటి నాయకులు ఏం మాట్లాడినా పట్టించుకోవద్దని, అసలు బీజేపీ నేతలు మనపై విమర్శలు చేస్తే ఓపిక పట్టాలని చంద్రబాబు నేతలకు పలుమార్లు సూచించారు. కానీ బీజేపీ నేతల విమర్శలకు టీడీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.