Found this funny.. Amith Shah asked for 150 seats out of 182 in Gujarat. Gujju people gave him 99 after deducting 28% GST. Wrote Lakshmi Manchu on her twitter page today teasing Amith Shah and considering the result of Gujarat Election.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 150 సీట్లు టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ 99 సీట్లకే పరిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఆ పార్టీ 80 సీట్లు గెలుచుకుంది. గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
గుజరాత్ ఫలితాలను చూసి ప్రధాని మోడీ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి స్పందించారు.
ఫౌండ్ దిస్ ఫన్నీ.. అంటూ 182 సీట్లున్న గుజరాత్‌లో అమిత్ షా 150 సీట్లను అడిగారని, గుజరాత్ ప్రజలు మొత్తం సీట్ల నుంచి 28 శాతం జీఎస్టీని తీసేసి 99 సీట్లు ఇచ్చారని మంచు లక్ష్మి తన ట్విట్టర్ అకౌంటులో పేర్కొన్నారు.
అమిత్ షా అడిగిన 150లో 28 శాతం జీఎస్టీని తీసి వేస్తే మిగిలేది 99 అని, ఆ సీట్లు బీజేపీకి గుజరాత్‌లో వచ్చాయని మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్ చేశారు.