బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి ఒకే వేదికపై : పొగడ్తల హోరు !

2017-12-19 2,646

Film actors Chiranjeevi, Balakrishna, Nagarjuna, Mohan Babu, Rajendra Prasad, Jagapati Babu, director SS Rajamouli, K Raghavendra Rao, producer Dil Raju and yesteryear actor Jamuna were among those who stole the show.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తెలుగు సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమవారం సాయంత్రం తెలుగు సినీ ప్రముఖులను గవర్నర్ నరసింహన్ సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికీ, తెలుగు భాష అభివృద్ధికీ కెసిఆర్ చేస్తున్న కృషిని సినీ ప్రముఖులు కొనియాడారు. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ తెలుగువాడిని కావడం వల్లనే 300 సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు.
ప్రారంభ సమావేశంలో సీఎం కేసీఆర్ పద్యాలు పాడటం చూస్తే ఆయన భాషాభిమానం తెలుస్తోందని ప్రముఖ నటి జమున అన్నారు.ప్రపంచ తెలగు మహాసభల్లో తనను భాగస్వామిని చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 1వ తరగతి నుంచి 12 వతరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలని సీఎం నిర్ణయించడం చూస్తే సంతోషం కలుగుతోందని అన్నారు.
బంగారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నారని మోహన్ బాబు అన్నారు. తెలుగు భాష ఎక్కడ చచ్చిపోతుందో అని తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసేందుకు కృషిచేస్తున్న తెలంగాణ పోరాట యోధుడు కేసీఆర్‌కు ధన్యవాదాలని అన్నారు

Videos similaires