Varun Dhawan made his striking Bollywood debut with Karan Johar's Student Of The Year. After delivering several hits in a row, he is considered to be one of the most successful actors among the current crop.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ 2012లో కరణ్ జోహార్ మూవీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతో పెర్ఫార్మెన్స్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన యువ హీరో.... 2017లో జాక్ పాట్ కొట్టాడు.
2017 సంవత్సరం వరుణ్ ధావన్ సోలో హీరోగా విడుదలైన ‘బద్రినాథ్ కి దుల్హనియా', ‘జుడ్వా 2' చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాల ద్వారా కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న వరుణ్ ఆ డబ్బుతో ముంబైలో ఖరీదైన ఫ్లాటు కొన్నాడు.
వరుణ్ ధావన్ తన న్యూ ఫ్లాట్ గృహ ప్రవేశం సందర్భంగా.... పలువురు బాలీవుడ్ ప్రముఖులను పిలిచి చిన్న పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వీడియో తీసి ఇన్‌స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు.
వరుణ్ ధావన్ తీసుకున్న ఈ కొత్త ఇంట్లో లివింగ్ రూమ్ విశాలంగా చూడ్డానికి ఎంతో బావుంది. ఇతర యాక్టర్లు వచ్చి టైమ్ స్పెండ్ చేయడానికి, చిట్ చాట్ చేయడానికి అనువుగా ఈ లివింగ్ రూమ్ డిజైన్ చేశారు.
వరుణ్ ధావన్ ఫ్యామిలీ ముంబైలోనే వేరే ఇంట్లో ఉంటారు. అయితే తన బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి మాత్రం ప్రత్యేకంగా వరుణ్ ధావన్ ఈ కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశారు.
ప్రస్తుతం వరుణ్ ధావన్ నటాషా దలాల్ అనే బ్యూటీతో డేటింగులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ గృహప్రవేశం కార్యక్రమానికి ఆమె కూడా హాజరు కావడం గమనార్హం.