గుజరాత్ BJP ఎఫెక్ట్ : 2018, 2019 ఎన్నికలపై ప్రభావం, జగన్ కి కలిసొచ్చే అంశమే !

2017-12-18 1

After the General Elections 2014, the Gujarat polls have become the biggest test for Prime Minister Modi.He would want to win Gujarat at any cost, because the BJP’s return to power in the Lok Sabha in 2019.

గుజరాత్ ఎన్నికలు 2019 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కూడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.అయితే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బిజెపితో కాంగ్రెస్ పోటా పోటీగా నిలిచే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బిజెపి మాత్రం మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొంది. కానీ, ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బిజెపి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రభావం వచ్చే ఏడాదిలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు రాజకీయ పునరేకీకకరణకు కూడ అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గుజరాత్ ఎన్నికల ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై కన్పించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. apలో 2019 లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పుడు bjp సంక్లిష్ట గెలుపు tdp పై ప్రభావం చూపకుండా ఉండదనే అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇప్పటి bjp కష్టతర గెలుపు 2019 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపితే గనుక అది bjp తో పొత్తు కొనసాగిస్తున్న tdp పై కూడా ఉండబోతుందనేది ఇప్పటికే స్పష్టమైన విషయం. మరి ఇది జగన్ కి ఎంత వరకు కలిసొస్తుందో మాత్రం చూడాలి.