Virbhadra Singh highest time Cm record in Himachal Pradesh, in 1983 Virabhadra singh was elected first time CM for Himachalpradesh.
1992లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడ అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా దూసుకుపోతోంది.అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలనే ఈ ఎన్నికల్లో బిజెపికి అధికారాన్ని కట్టబెట్టాయనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎం పదవిలో కొనసాగిన వ్యక్తిగా వీరభద్రసింగ్ రికార్డ్ సృష్టించారు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధిపత్యాన్ని బిజెపి దెబ్బకొట్టింది. అయితే వరుసగా బిజెపి లేదా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ హవా ఈ రాష్ట్రంలో స్పష్టం కన్పించింది. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద వచ్చిన ఆరోపణలు కూడ ఆ పార్టీ ఓటమికి కారణమని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 1990 వరకుహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎదురే లేకుండా పోయింది.1952 మార్చి 8, యశ్వంత్ సింగ్ పార్మార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.1956 అక్టోబర్ 31 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1963 జూలై 1వ,తేదిన ఆయన మరోసారి సీఎంగా భాద్యతలను చేపట్టారు.1977 జనవరి 28న ఠాకూర్ రాంలాల్ సీఎంగా బాధ్యతలను చేపట్టారు.1977 ఏప్రిల్ 30 వరకు ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు.1990 వరకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.