Prime Minister Narendra Modi today flashed a victory sign after he arrived in Parliament, as the BJP pulled ahead of the Congress in trends for the Gujarat and Himachal Pradesh assembly polls.
సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కారులో నుంచి కాలు బయట పెట్టగానే విక్టరీ చిహ్నాన్ని చూపిస్తూ లోపలికి వెళ్లారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఫలితాలపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సూరత్ ప్రాంతంలో పది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దక్షిణ, మధ్య గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా - నేనా అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్తోంది.2001 నుండి గుజరాత్ రాష్ట్రంలో బిజెపి ఆధికారంలో ఉంది. అయితే ముఖ్యమంత్రులు మాత్రం మారారు. 1990లో బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1995లో స్వంతంగా గుజరాత్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది.ఈ ఎన్నికల్లో కూడ అధికారాన్ని చేపట్టే దిశగా ఫలితాలు కన్పిస్తున్నాయి.