మళ్లీ రెచ్చిపోయిన రాధికా.. మరీ ఇంత బోల్డ్ గా నా ?

2017-12-16 12

Feel like you haven’t seen enough of Radhika Apte this year? Us either. But don’t worry, the thinking man’s pin-up girl is going to be all over your screens in 2018.

మర్డర్ లాంటి సినిమాలో మల్లికా షెరావత్ పలికించిన శృంగార అభినయాన్ని అంత ఈజీగా మరిచిపోలేం. అలాగే పర్చేడ్ సినిమాలో.. ఓవైపు బిడియంతో కనిపిస్తూనే శృంగారంలో పాల్గొనే రాధికా ఆప్టే పాత్రనూ మరిచిపోలేం. ఒకరకంగా మల్లికా షెరావత్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రాధికా ఆప్టే బోల్డ్ బ్యూటీ అన్న పేరు తెచ్చుకుంది. ఏకంగా షార్ట్ ఫిలింస్ కోసమే న్యూడ్‌గా నటించి.. సినిమా విషయంలో తనకెలాంటి పరిమితులు లేవని తేల్చి చెప్పింది. అలాంటి రాధికా ఆప్టే.. తాజాగా మరిన్ని హాట్ హాట్ పోజులతో అభిమానులకు మత్తెక్కిస్తోంది.
జీక్యూ మేగజైన్ కోసం రాధికా ఆప్టే రీసెంట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. బోల్డ్ లుక్స్‌తో పెయింటర్‌ గెటప్‌లో కనిపిస్తున్న ఆమె ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
రాధికా ఆప్టే ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి ప్యాడ్ మ్యాన్ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న సానిటరీ ప్యాడ్స్ సమస్యల ఇతివృత్తంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సానిటరీ ప్యాడ్స్ సమస్యను రూపుమాపేలా 'ప్యాడ్ మ్యాన్' అనే వ్యక్తి అతి తక్కువ ఖర్చులో వాటిని తయారు చేయడం కోసం పడ్డ కష్టాన్ని.. ఆ క్రమంలో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల నుంచి ఎదుర్కొన్న ఛీత్కారాలను ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది.
ఆమధ్య పర్చేడ్ సినిమాలో బోల్డ్ సీన్స్ పై వివాదం జరిగినప్పుడు.. 'అవును నగ్నంగా నటిస్తే తప్పేంటి' అని రాధిక ధైర్యంగా వాదించింది.