యోగి-ఆజంఖాన్ చేతులు కలిపారు , వీడియో వైరల్ !

2017-12-15 1

Uttar Pradesh chief minister Yogi Adityanath and Samajwadi Party leader Azam Khan were captured on camera walking hand-in-hand on Thursday at the state assembly corridors.

ఉత్తరప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభకు వస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎస్పీ నేత ఆజంఖాన్.. ఒకే సమయంల అసెంబ్లీ కారిడార్‌లోకి అడుగుపెట్టారు. ఒకరినొకరు చూసుకుని సరదాగా పలకరించుకున్నారు.
చేతులు కలిపి నడస్తూ.. వివిధ అంశాలలపై చర్చించారు యోగి-ఆజంఖాన్. ఈ పరిణామం అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత వారిని ఆకట్టుకుంది. ఆజంఖాన్ తోపాటు అతని కుమారుడు అబ్దుల్లా కూడా ఉన్నారు.
అయితే, గతంలో యోగి, ఆజంఖాన్ ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండేవి. ఒకసారి యోగి మాట్లాడుతూ.. నమాజ్, సూర్య నమస్కారాలూ దాదాపు ఒకేలా ఉంటాయని అన్నారు. దీనిపై ఆజంఖాన్ స్పందిస్తూ.. అలా అయితే సూర్య నమస్కారాలకు బదులు నమాజ్ చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు.
వారిద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు, ప్రత్యర్థులు. కానీ, వారు మాట్లాడితే సంచలనమో, వివాదాస్పదమో అవుతుంది. రెండు వ్యతిరేక వర్గాలుగా ఉన్న ఆ నేతలిద్దరూ కలిశారు. చేతులు కలిపారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఈ పరిణామం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Videos similaires