ఏపీకి గూగుల్ ఎక్స్ కార్యాలయం : ఫైబర్‌ కేబుల్‌ లేకుండానే మొబైల్‌ డేటా, వైఫై

2017-12-15 364

Andhra Pradesh Minister for Information and Technology Nara Lokesh visited the Google X headquarters in United States' San Francisco. Speaking to ANI, Lokesh expressed happiness over the meeting and said the government of Andhra Pradesh and Google X had entered into an agreement to do multitude of activities in the state.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ తరలిరానుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్‌ ఎక్స్‌ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గూగుల్‌ ఎక్స్‌ సంస్థ మధ్య ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకూ అమెరికాలో తప్ప ఏ ఇతర దేశంలోనూ కార్యకలాపాలు సాగించలేదు గూగుల్‌ ఎక్స్‌. అయితే, తాజా కుదిరిన ఒప్పందం ద్వారా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు ఈ సంస్థ రావడం విశేషం. విశాఖ పట్నంలో త్వరలోనే ఇది ఏర్పాటు కానుంది.
అమెరికా పర్యటనలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో దిగ్గజ సంస్థ గూగుల్‌ ఎక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ అధికారులు, గూగుల్‌ ఎక్స్‌ సీఈఓ అస్టో టెల్లర్‌ మధ్య ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్‌ ఎక్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటుకానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్‌ ఆప్టికల్‌ కమ్యూనికేషన్‌ లింక్స్‌ను గూగుల్‌ ఎక్స్‌ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్‌ కేబుల్‌ అవసరం లేకుండానే మొబైల్‌ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Free Traffic Exchange