విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించిన రాజేష్ !

2017-12-14 2

Swathi lover Rajesh reveals many in police investigation on Thursday.

కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజేష్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే సమయంలో ఆయన మీడియాతో పొడిపొడిగా మాట్లాడాడు. పోలీసుల విచారణలోను ఆసక్తికర విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది.
రాజేష్ ఓ ఫిజియోథెరపీ సెంటర్‌లో సాధారణ వేతనానికి పని చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో స్వాతినే అతనిని ఆర్థికంగా ఆదుకున్నట్లుగా చెప్పాడు.
స్వాతి ఇచ్చిన డబ్బులతోనే దుస్తులు కొనుక్కునేవాడిని అని రాజేష్ విచారణలో వెల్లడించాడని తెలుస్తోంది.
సుధాకర్ రెడ్డి హత్య విషయంలో స్వాతి చెప్పినట్లే తాను చేశానని రాజేష్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు గురువారం ఉధయం అతనిని కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓ ఆసుపత్రి నుంచి తరలించారు. అనంతరం అతనిని విచారించారు. కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
పథకం ప్రకారం కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన స్వాతి ప్రస్తుతం పాలమూరు జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నది. అయితే ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని తెలుస్తోంది. తోటి ఖైదీలకు దూరంగా ఉంటోంది. స్వాతికి జైలు అధికారులు 678 ఖైదీ నెంబర్ కేటాయించారు.