Gujarat Assembly Election : లైన్లో నిల్చుని ఓటేసిన మోడీ, అరుణ్ జైట్లీ

2017-12-14 504

Gujarat assembly elections : Watch PM Modi casts his vote. Many senior BJP leaders, including Amit Shah and Arun Jaitley casts their votes

గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 12గంటల వరకు 29.80శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
గురువారం మధ్యాహ్నం 12.15గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లతోపాటు వరుసలో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మోడీ. ఉదయం 11గంటల ప్రాంతంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకి ఆనంద్‌లోని 201 పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. - గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీబీ స్వాయిన్.. గాంధీ నగర్‌లో ఓటు వేశారు. ఉదయం 10.30గంటల ప్రాంతంలో గుజరాత్ డిప్యూటీ సీఎ నితిన్ పటేల్.. మెహసాన్స్ కడిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10గంటల ప్రాంతంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వెజల్పూర్ పోలింగ్ బూత్ వద్ద వరుసలో నిల్చుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ఈ సందర్భంగా జైట్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు.