After smashing 208 (not out) in the second ODI match against Sri Lanka on Wednesday, cricketer Rohit Sharma said that 2017 has been the ‘best year’ for him as a cricketer.
పెళ్లి రోజు తాను ఇచ్చిన డబుల్ సెంచరీ బహుమతి తన భార్యకు నచ్చి ఉంటుందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ 'నేను ఎప్పటిలాగే ఆడాను. బంతి టైమింగ్‌ను చూసి ఆడతా. బంతి పడే సమయానికి లైన్ చూసుకుని బాదుతా. నాకు తెలుసు, నేను మహేంద్ర సింగ్ ధోని లేదా క్రిస్ గేల్ కాదు. వాళ్లకు ఉన్నంత రిస్ట్ పవర్ కూడా లేదు. బంతి టైమింగ్‌ను బట్టి నేను ఆడతా' అని అన్నాడు. ఎక్కవ సేపు క్రీజులో ఉండాలని భావించా. మొహాలి వికెట్ సూపర్బ్‌గా ఉంది. ఔట్ ఫీల్డ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని నాకు నేనుగా చెప్పుకున్నా. అదే చేశా' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. గతంలో రోహిత్‌శర్మ ఆస్ట్రేలియా, శ్రీలంకపై డబుల్ సెంచరీలు చేశాడు. ఇదే శ్రీలంకపై కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు.