YSR Congress Party chief YS Jaganmohan Reddy's fan warning videos hulchal in social media against Jana Sena chief Pawan Kalyan!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే చంపేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు హెచ్చరికలు వచ్చాయి. ఆ హెచ్చరికలు చేసింది జగన్ అభిమాని. ఇది కలకలం రేపింది.
పవన్ కళ్యాణ్‌ను హెచ్చరించిన జగన్ అభిమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతని పేరు వెంకట రెడ్డి. అతను రెండు హత్య కేసుల్లో నిందితుడు అని ప్రచారం సాగుతోంది. వెంకట రెడ్డి తన సెల్ఫీ వీడియోలో పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ హెచ్చరికలు జారీ చేశాడు.అందులో అసభ్య పదజాలాలు వాడాడు. జగన్‌తో పోలీస్తే పవన్ కళ్యాణ్ పిల్లవాడు అని, కోన్ కిస్కా గొట్టంగాడు అని విమర్శించాడు. జగనన్న సైన్యం ఉందని, ఆయనను ఏమైనా అంటే చంపడానికి, చావడానికి అయినా సిద్ధమేనని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ జబర్దస్త్ కార్యక్రమంలోని హైపర్ ఆదితో సమానమని, ప్రజలకు జగన్ దేవుడిలాంటి వాడని చెప్పాడు. జగన్ ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజించే వారు ఉన్నారని చెప్పాడు. అంతేకాదు, నాది గుంటూరు అని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ చేశాడు.