పవన్ కు రోజా ధీటైన కౌంటర్ !

2017-12-13 3,018

YSRCP State mahila wing president and Nagari MLA RK Roja on Tuesday observed that people of the State are vexed with incohesive stand of Jana Sena Party president and actor Pawan Kalyan towards glaring failures of the Chandrababu Naidu government.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకునే వాళ్లకు ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకొని పవన్ మాట్లాడుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇటీవల పవన్ కళ్యాణ్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై మండిపడ్డారు. ప్రజా సమస్యలు తీర్చాలంటే పదవులు ఉండనక్కరలేదని, వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం సరికాదని జనసేనాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రోజా స్పందించారు.
పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత జగన్‌ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని రోజా మండిపడ్డారు. జగన్ నిత్యం ప్రజల్లో ఉంటున్నారని ఆమె చెప్పారు. డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు అన్యాయం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధినేతపై విమర్శలు చేస్తున్నారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఎలా పడతాయన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వని మోడీని, ప్రజలకు న్యాయం చేయని చంద్రబాబును ప్రశ్నించాల్సింది పోయి మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు.

Videos similaires