ప్రముఖ సినీ నటి రోజా, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య పవన్ కళ్యాణ్ అంశంపై మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మాట మాట పెరిగి.... నీ పళ్లు రాలగొడతా అంటే నీ పళ్లు రాలగొడతా అంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. టీవీ9 నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పైకొచ్చిన వాళ్లు చాలా తక్కువని, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు గారు ఉన్న టైమ్ లో చిరంజీవి వచ్చారు. వీళ్లందరినీ కాదని చిరంజీవి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చాలా కష్టపడ్డారని రోజా చెప్పుకొచ్చారు.
చిరంజీవి వారసత్వంతో, ఆయన చరిష్మాను ఉపయోగించుకుని ఆయన కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలోకి వచ్చారని, వారు చిరంజీవి కుటుంబ సభ్యులు కాకుంటే వారికి అవకాశాలు ఎవరిస్తారు? వాళ్లకు టాలెంట్ ఉందా? లేదా? అనే విషయం తర్వాత తెలుస్తుంది అని రోజా అన్నారు. ఈ క్రమంలో రోజా మాట్లాడే తీరుతో ఇదే చర్చలో పాల్గొన్న బండ్ల గణేష్ హర్ట్ అయ్యారు.
"పవన్ కళ్యాణ్ గారిని మీరు వాడు వీడు అంటారేంటి? కళ్యాణ్ బాబుని వాడు, వీడు అని మీరు మాట్లాడతారా? అలా అనొద్దు మేడమ్,
రెస్పెక్ట్ ఇవ్వండి'' ‘‘కళ్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? ఎందుకు ఆయన్ను అలా అంటున్నారు?'' అని బండ్ల గణేష్ మండి పడ్డారు.‘‘పవన్ కళ్యాణ్‌ని జగన్ గారు ఏమైనా అన్నారా? జగన్ గారిని పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అంటున్నారు? '' అంటూ రోజా ఎదురు ప్రశ్నించారు.