చనిపోయిన డిఎస్పీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు, క్ల‌రిక‌ల్ మిస్టేక్ అంట ?

2017-12-13 99

DSP D Ramanjaneyulu, posted in the Tirumala special branch, had lost life around six months ago at a hospital, while undergoing treatment. but his name found its way to the list of 16 DSPs who were transferred, and he was asked to report to the police headquarters at Mangalagiri.

ఎపి పోలీస్ శాఖలో విచిత్రం చోటుచేసుకుంది. చనిపోయినవ్యక్తిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్టమెంట్ వార్తల్లోకెక్కింది. పైగా అలా ఆర్డర్ లు జారీ చేసింది ఏ చిరుద్యోగి గురించో కాదు ఏకంగా డిఎస్పీ స్థాయి అధికారి గురించి కావడం గమనార్హం. చనిపోయిన ఆరునెలల తరువాత బదిలీ చెయ్యడమే కాదు తక్షణమే వచ్చి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చెయ్యమని కూడా ఆదేశించార. ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోతున్న నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసే ఘటన ఇది. ఏదేమైనా ఈ వ్యవహారం ద్వారా పోలీస్ శాఖ అభాసుపాలైందని చెప్పక తప్పదు. పోస్టింగ్ కోసం బూట్లరిగేలా తిరుగుతున్న తమని పట్టించుకోని ఉన్నతాధికారులు చనిపోయినవారికి మాత్రం అడక్కుండానే ఆర్డర్ ఇస్తున్నారని పోలీసు సిబ్బందే విమర్శలు చేస్తున్నారు.
ఎ.పి.లో మొత్తం 16 మంది డిఎస్పీల‌ను బ‌దిలీ చేస్తూ డి.జి.పి. సోమ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం డిఎస్పీలను భారీ సంఖ్యలో ఒకేసారి 36 మందిని బదిలీ చేసిన ఎపి మళ్లీ రెండు నెలల వ్యవధిలో మరో 16 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జాబితాలో ఒక డిఎస్పీ పేరే సంచలనం సృష్టిస్తోంది.

Free Traffic Exchange