జయలలిత మరణం పై తాజాగా మరో ఆసక్తికర విషయం : స్టెరాయిడ్లు ఇచ్చినట్లు టాక్ !

2017-12-13 1,515

Shankar, An acupuncture doctor reveals shocking facts over jayalalithaa lost life.

దివంగత సీఎం జయలలిత మరణించి ఏడాది పూర్తయినా.. ఇంకా ఆమె మరణంపై చర్చ సద్దుమణగలేదు. జయ మృతిపై ఆమె అభిమానులకు, ఆప్తులకు ఇప్పటికీ ఎన్నో అనుమానాలు. చివరి రోజుల్లో ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినవాళ్లు అతకొద్ది మాత్రమే. నాటకీయ పరిణామాల నడుమ అపోలో ఆసుపత్రిలో కన్నుమూసిన జయలలిత మరణానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
అపోలో ఆసుపత్రికి తరలించడం కన్నా ముందు జయలలితకు ఇంట్లోనే చికిత్స అందించారన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జయలలితకు మోతాదుకు మించి స్టెరాయిడ్లు ఇచ్చినట్లు ఆక్యుపంక్చర్‌ వైద్య నిపుణుడు శంకర్‌ బాంబు పేల్చారు.
ఆక్యుపంక్చర్‌ వైద్య నిపుణుడైన శంకర్‌.. గతంలో జయలలితకు కూడా చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో.. జయ మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఆరుముగన్‌(మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి) కమిటీ మంగళవారం ఆయన సాక్ష్యాన్ని నమోదు చేసింది.

Videos similaires