జగన్ ని ప్రజలు కూడా మరిచిపోతారులే, డోంట్ వర్రీ !

2017-12-13 313

Nara Chandrababu Naidu has following strategy to counter Jana Sena chief Pawan Kalyan and YSR Congress party chief YS Jagan.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎదురు పక్షాల విమర్శలకు తోక తొక్కిన తాచుల్లా లేచే తెలుగుదేశం పార్టీ నాయకులు వారిద్దరి పట్ల కూడా మౌనంగానే ఉంటున్నారు. ఏదైనా మాట్లాడితే చంద్రబాబు మాత్రమే మాట్లాడుతున్నారు. చంద్రబాబు వ్యూహంలో భాగంగానే టిడిపి నాయకులు మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి, తెలుగుదేశం ప్రభుత్వంపై కూడా ఏదో మేరకు పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.అయితే పవన్ కల్యాణ్ పట్ల తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంయమనం పాటిస్తోంది. పవన్ కల్యాణ్‌ను ఇప్పటికీ చంద్రబాబు మిత్రుడిగానే భావిస్తున్నారు. అందుకే సంయమనం పాటించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు.

Videos similaires