సూపర్ స్టార్ రజనీకాంత్ @67 : ఎంత చెప్పినా తక్కువే !

2017-12-12 273

Superstar Rajinikanth is the trending name today, as the most-loved actor in the country is celebrating his 67th birthday .

సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు 67వ వసంతంలోకి అడుగు పెట్టారు. రజనీకాంత్ అంటే తెలియని వారు ఆయన మంచితనం గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ గొప్ప సినిమా నటుడు. దేశంలో ప్రముఖ ప్రజాదరణ కలిగిన నటుడు. రజనీకాంత్ కంటే గొప్పగా నటించే వాళ్ళున్నా అంతమంది అభిమానులని సంపాదించింది ఆయన వ్యక్తిత్వం మంచితనమే. సినిమాల పరంగా కంటే ఒక మంచి మనిషి లాగానే ఆయనకు ఎక్కువమంది అభిమానులున్నారు. ఇటీవల తమిళనాడులో ఓఖి తుఫాను కారణంగా దాదాపు 500 మంది తమిళ జాలర్లు గల్లంతయ్యారు. 40 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఇలాంటి తరుణంలో పుట్టినరోజు సంబరాలు జరుపుకోవడానికి రజనీ ఇష్టపడటం లేదని, అందుకే రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయారని సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడే కాదు పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు చేసే హడావిడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఏడాది దూర ప్రాంతాలకు వెళ్లిపోయే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇలాంటి సంఘటనలు ఎన్నో ఆయన మంచితనాన్ని చూపించడానికి ఉన్నాయి. ఈ వయసులో కూడా అంతమంది అభిమానులున్నారంటే ఆయన క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఒక్క తమిళనాడులోనే కాదు దేశమంతటా ఆయన అభిమానులు ఉన్నారు. సాధారణ ప్రేక్షకుడి దగ్గర నుంచి బాలీవుడ్ హీరోల వరకూ అందరూ ఆయన అభిమానులే. ప్రస్తుతం దక్షిణాది నుంచి ఇంత ఇమేజ్ ఉన్న హీరో లేడంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు బాలీవుడ్ హీరోలు కూడా రజనీని ఏ రేంజ్ లో అభిమానిస్తారో అందరకి తెలిసిందే. షారూక్ ఖాన్ ఏకంగా తన సినిమాలో ఒక పాటతో ఆయనమీద అభిమానాన్ని చాటుకున్నాడు.

Videos similaires