Mahesh Katti again made comments on Jana Sena chief Pawan Kalyan in Facebook posts
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి తన దాడిని ఆపడం లేదు. మరోసారి పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కులం పట్ల అనుసరిస్తన్న వైఖరిని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో పరకాల ప్రభాకర్ పోషించిన పాత్రపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మహేష్ కత్తి స్పందించారు. పరకాల ప్రభాకర్‌ను ఔట్ చేయాలంటే ఏం చేయాలో కూడా ఆయన సూచించారు.
నువ్వు పరకాల ప్రభాకర్ మీద కక్ష తీర్చుకోవాలికదా. నా సలహా విను. నీ కక్షతీరే కిటుకు చెబుతా విను. పరకాల ప్రభాకర్ గోదావరి పుష్కర కమిటీకి ఛైర్మెన్. ఏ పుష్కరాల్లో షూటింగ్ కోసం తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయారో, ఆ పుష్కరాల కమిటీ. పుష్కరాల తొక్కిసలాటపై సి.వై.సోమయాజులు కమిటీ వేశారు. కానీ ఇంతవరకూ ఆ కమిటీ ఎటూ తేల్చలేదు. తెలిస్తే మాత్రం పరకాల ప్రభాకర్ ఔట్" అని మహేష్ కత్తి అన్నారు. దీని కోసం ఒక ప్రజా ఉద్యమం తీసుకొద్దాం. స్వామికార్యం స్వకార్యం రెండూ అవుతాయి. పుష్కరాల్లో చనిపోయినవాళ్లకు న్యాయం. నీ కక్షకు కక్షా...ఒకే నా... నీకు ఒకే కాదులే...నీకు అంత ధైర్యం ఎక్కడుంది!ఎదో నాలాంటి వాళ్ళ మీద ఫ్యాన్స్ ని ఉసిగొల్పి ఇగో తృప్తిపర్చుకో. చాలు. నువ్వు నీ సలహాదారులు ఎవరూ రాజకీయానికి, ప్రజాక్షేమానికి పనికిరారు. అని మహేష్ కత్తి అన్నారు. నా బర్త్ డే గిఫ్ట్ అంటూ ముక్తాయింపు ఇచ్చారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడతాను అని అనకుండా కుల వివక్ష ఉన్నది ఉండబొద్ది అని నిర్లిప్తతతో కూడిన మాటలు మాట్లాడడం కొత్తగా రాజకీయాలలోకి వద్దామనుకుంటున్న పవన్ కల్యాణ్‌కు శోభాయమానం కాదని ఆయన అన్నారు. కులాల మధ్య అది కూడా రెండు కులాలను ప్రస్తావిస్తూ ఆ కులాల మధ్య సామరస్యం కోసం పోరాడితే కానీ అమరావతి అభివృద్ధి కాదన్నట్టు గ మాట్లాడడం అంత వాంఛనీయం కాదని అన్నారు.