Akhil Akkineni’s debut film may have turned out to be a dud at the box office but the Akkineni fans haven’t written him off as yet. Akhils upcoming film Hello which is due for release on December 22, to cash in on the long Christmas weekend.
ప్రతిష్మాత్మక సినీ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో ఏ సినిమా రూపొందింనా ఓ స్థాయిలో ప్రమోట్ చేయడంలో అక్కినేని నాగార్జునది ఓ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. తన కుమారుడు అఖిల్ నటించిన హలో చిత్రం డిసెంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతున్నది. సాధారణంగా సినిమా గురించి డిఫరెంట్‌గా ప్రమోట్ చేసే నాగ్.. తాజాగా వైజాగ్‌లో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో ఓ అడుగు ముందు వేసి సినిమా బ్లాక్‌బస్టర్ అని డిక్లేర్ చేశాడు. ఈ సినిమా విజయంపై ఉన్న ధీమాను వ్యక్తం చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మా మనసుకు దగ్గరైన డైరెక్టర్ విక్రమ్ కుమార్. తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో లెజెండ్‌గా నిలిచిపోయిన నాన్నగారి ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుండగా, నాకు దేవుడులా వచ్చిన విక్రమ్‌కుమార్ నాతో మనం లాంటి సినిమా చేశాడు. నాన్నగారిని ఎంతో గొప్పగా సాగనంపాడు.ఇప్పుడు అఖిల్‌ని ఈ సినిమాతో రీలాంచ్ చేస్తున్నాను. అఖిల్‌ను ఎలా చూడాలనుకున్నాను అనే విషయాన్ని విక్రమ్‌తో చెబితే తను `హలో` సినిమాను తయారు చేశాడు. అక్కినేని అభిమానులు అఖిల్‌ను ఎలా చూడాలనుకుంటారో అలాగే ఈ సినిమాలో చూస్తారు.