దేశంలోనే తొలి సారి సముద్ర విమానంలో! మోడీ వ్యంగ్యాస్త్రాలు

2017-12-12 884

Prime Minister Narendra Modi will travel in a sea-plane from Sabarmati river in the city to Dharoi dam in Mehsana district, the first-ever flight by such a craft in the country. His return journey would also be by the same sea-plane, he announced at a poll rally on Monday.

గుజరాత్ శాసన సభ ఎన్నికల రెండోదశ ప్రచారం మంగళవారంతో ముగియనుంది. మంగళవారం అహ్మదాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేం‍ద్ర మోడీ నిర్వహించతలపెట్టిన ర్యాలీకి భద్రతా కారాణాల దృష్ట్యా స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త ప్రయోగం చేస్తున్నారు.
పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా వినూత్నంగా గుజరాత్ ప్రజల ముందుకు రాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతి నదిలో సముద్ర విమానం (సీప్లేన్) లో ప్రయాణించి ధారోయ్‌ డ్యామ్‌కు చేరుకుంటారు.
ధారోయ్ డ్యామ్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించి అంబాజి చేరుకుంటారు. తరువాత అంబాజీలోని అంబా మాత ఆలయాన్ని దర్శించుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు.దేశంలో సీప్లేన్‌ ప్రయాణం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇలాంటి అభివృద్ధిని ఊహించి కూడా ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Videos similaires