విరాట్ కోహ్లీ, అనుష్క ఒక్కటైపోయారు ! పెళ్ళి వీడియో

2017-12-12 905

Virat Kohli and Anushka Sharma have tied the knot and got hitched in a destination wedding at Milan, Italy

బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం ఇటలీలోని మిలాన్‌లో ఘనంగా జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. తమ పెళ్లి వార్తను విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలిద్దరూ తమ ట్విట్టర్ అకౌంట్లలో అధికారికంగా ప్రకటించారు.
జీవితాంతం కలిసి ఉండాలని ఈ రోజు మేము ఒట్టుపెట్టుకొన్నాం. మా వివాహ వార్తను తెలియజేయడానికి చాలా సంతోషిస్తాన్నాం. నా కుటుంబానికి, సన్నిహితుల ప్రేమానురాగాలతో ఈ రోజు చాలా అందమైన రోజుగా మారింది. అత్యంత కీలకమైన నా జీవిత ప్రయాణంలో భాగమైన వారిందరికీ థ్యాంక్యూ అని ట్వీట్టర్‌లో విరాట్ కోహ్లీ వెల్లడించారు.
విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన సందేశాన్నే అనుష్క శర్మ కూడా పోస్ట్ చేశారు. ఈ వివాహం తర్వాత విరుష్క ఇద్దరూ దేశంలోనే మోస్ట్ పవర్ ఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా మారిపొయారు. అనుష్క ట్విట్టర్ అకౌంట్‌లో దాదాపు 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరు సెలబ్రిటీలకు వివాహం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పెళ్లి కార్యక్రమం కోసం అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి గతవారం ఇటలీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. వారి వెంట కుటుంబ పూజారులు కూడా వెళ్లడంతో వారి పెళ్లి వార్తకు బలం చేకూరింది.