Rajamouli presents designs for Amaravati to Chandrababu

2017-12-11 409

Tollywood Director SS Rajamouli, overviewing the design of the architecture of the Assembly, and the administrative city of Amaravati, gave a presentation of designs to the Chief Minister N Chandrababu Naidu.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో పరిపాలనా నగరానికి సంబంధించి డిజైన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి సమావేశమయ్యారు. ఆదివారం హైదరాబాదులో ఈ భేటీ జరిగింది. రాజధాని నగరానికి సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థ బృందం అందచేసిన డిజైన్లపై వారిద్దరు చర్చించారు. పరిపాలనా నగరం, శాసనసభ భవనాలకు సంబంధించి కొన్ని డిజైన్లను ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు.
రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆధునికతల మేళవింపుగా రాజధాని నగరం ఉండాలని భావిస్తున్నట్లు చంద్రబాబు రాజమౌళితో చెప్పారు. ఇప్పటికే నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లకు కొన్ని మార్పులను రాజమౌళి సూచించారు.
రాజమౌళితో భేటీ తర్వాత సీఆర్‌డీఏ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వెంకటపాలెం నుంచి దొండపాడు వరకూ నిర్మిస్తున్న స్పీడ్ యాక్సెస్ రోడ్డు పనులను వచ్చే జనవరి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.