తెలుగు హీరో, కమెడియన్ విజయ్ ఆత్మహత్య !

2017-12-11 4

Bommarillu & Ammayilu Abbayilu Fame Comedian Vijay is no more.

తెలుగు చలన చిత్ర సీమలో ఓ ధృవతార నేలరాలింది. విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న హీరో, కమెడియన్, కామెడీ ఆర్టిస్ విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత కొద్దికాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. సినిమా అవకాశాలు తగ్గడంతో డిప్రెషన్ లోనయ్యాడని సన్నిహితులు పేర్కొంటున్నారు. కొద్దికాలంగా చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తున్నది. విజయ్ ఆకస్మిక మృతితో ఫిలింనగర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి.
యూసఫ్ గూడలోని తన ప్లాట్‌లో విజయ్ విగత జీవిగా కనిపించాడు. విజయ్ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నట్టు తాజా సమాచారం. విజయ్ ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు.
అమ్మాయిలు అబ్బాయిలు చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బ్యాక్ ప్యాకెట్ అనే చిత్రంలో సోలో హీరోగా నటించారు. ఆ తర్వాత వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ వీపీ అండ్ పీపీ అనే చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌తో కలిసి ఓ హీరోగా నటించారు.