సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తున్న బికినీ బేబీ !

2017-12-09 6

The lovely Riya Sen's latest Twitter picture sporting a black bikini has got us thinking as to which one looks really good on her.

బాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పడు కనిపిస్తున్న బాలీవుడ్ రియా సేన్ ట్విట్టర్‌లో మాత్రం సంచలనం రేపుతుంటుంది. హిందీ, మలయాళ, ఒరియా, బెంగాలీ చిత్రాల్లో నటించే రియా సోషల్‌ మీడియాలో మాత్రం అగ్గి రాజేస్తుంటుంది. ఆమె చివరిసారి రబ్బా మై క్యా కరూ అనే హిందీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్స్న్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న రియా సేన్ తాజాగా ట్విట్టర్‌లో పెట్టిన ఫొటో దుమారం లేపుతున్నది.
బాయ్‌ఫ్రెండ్ శివమ్ తివారీని పెళ్లి చేసుకొన్న తర్వాత దాదాపు బాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. అప్పట్లో హానీమూన్ ఫొటోలను సోషల్ మీడియాలో గుప్పించి సంచలనం రేపింది. తాజాగా బ్లాక్ స్విమ్‌సూట్‌లో ఉన్న తన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది.
అయితే బాలీవుడ్ లో బాగా పరిచయమున్న ఈ భామ..తెలుగులో మంచు మనోజ్ నటించిన నేను మీకు తెలుసా అనే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాల రాకపోవడం, బెంగాలీ భాషలో భారీ ఆఫర్లు దక్కడంతో బిజీగా మారింది.