Pawan Kalyan Awareness on People Problems, Many Questions Raising

2017-12-09 787

There are some questions raising over Janasena Presient Pawan Kalyan awareness on people problems.

ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాక ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన, వాటిని పరిష్కరానికి తమవంతు ఆలోచన తప్పనిసరి. ఇవేవి లేకుండా సమస్యలు విన్న ప్రతీసారి.. అధ్యయనం చేసి చెబుతానంటే ఆ నాయకుడి సమర్థత ఏపాటిదో జనం గమనిస్తారు. ప్రజారాజ్యం సమయంలో ఆ పార్టీ అధినేత చిరంజీవి కూడా ఇలాగే అభాసుపాలయ్యారు. మీడియా సమావేశాల్లో దేని గురించి ప్రశ్నించినా.. అధ్యయనం చేసి చెబుతానని అనేవారు. దీనివల్ల ఆయన అవగాహన స్థాయి ఏంటో తేలిపోయింది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోను ఇదే రిపీట్ అవుతుందా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడ పర్యటన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విద్యుత్ ఒప్పంద కార్మికులు కలిసి.. తమ సమస్యలను విన్నవించారు. తమను రెగ్యులరైజ్‌ చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. 24వేల మంది ఒప్పంద కార్మికులం ఉన్నాం. ఇప్పుడు మా గురంచి పట్టించుకోవట్లేదు అని పవన్ తో విన్నవించారు